భారతదేశం, ఏప్రిల్ 15 -- Guntur Crime: కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన తండ్రికి స్థానికులు దేహశుద్ధి చేసిన ఘటన గుంటూరులో వెలుగు చూసింది. ఈ ఘటనపై భ‌ర్త‌పై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ప్రాథ‌మిక విచార‌ణ జ‌రిపి, నిందితుడిపై పోక్సో కేసు న‌మోదు చేశారు.

ఈ ఘ‌ట‌న గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని ఒక గ్రామంలో సోమ‌వారం తెల్ల‌వారు జామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం తెనాలి మండ‌లంలోని ఒక గ్రామంలో భార్య‌, భ‌ర్త‌లకు 13, 11 ఏళ్ల వ‌య‌సున్న‌ ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు. భ‌ర్త (40) గుంటూరులో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. సోమ‌వారం నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు గుంటూరులోనే ఉంటూ వారానికి రెండు రోజులు స్వ‌గ్రామానికి వ‌స్తాడు. రెండేళ్లుగా భార్య దుగ్గరాల మండలంలోని త‌న పుట్టింట్లోనే ఉంటూ కుమార్తెల‌ను చ‌దివించుకుంటుంది. ...