భారతదేశం, మార్చి 17 -- Guntur Crime: తెలంగాణకు చెందిన యువతితో గుంటూరుకు చెందిన యువకుడికి ఇన్‌స్టాలో పరిచయం, ప్రేమ పెళ్లికి దారి తీసింది. యువతి అదృశ్యంపై పోలీస్ కేసు నమోదు అయ్యాక యువతి అచూకీ కోసం గాలిస్తే గుంటూరు యువకుడితో ప్రేమ పెళ్లి వెలుగు చూసింది. కూతురు సంతోషం కోసం దానిని ఒప్పుకున్న కన్నవారికి చివరికి కన్నీళ్లు తప్పలేదు.

గుంటూరులోని ద్వార‌కాన‌గ‌ర్ ఏడో లైన్‌లో ఈ దారుణ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఆదివారం పోలీసులు, కుటుంబ స‌భ్యులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం తెలంగాణ‌లోని వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన గీతిక (19)కు సోష‌ల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రాంలో రీల్స్ చేయ‌టం అలవాటు. అందులో భాగంగానే గీతిక ఎప్ప‌టిక‌ప్పుడు రీల్స్ చేస్తూ ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేసేది.

గుంటూరు జిల్లా ద్వార‌కాన‌గ‌ర్ ఏడో లైన్‌కు చెందిన సాయి మ‌ణికంఠ పెయింటింగ్ ప‌నులు చేస్తుంటాడు. ...