భారతదేశం, జనవరి 28 -- బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్ మంజూరు అయ్యింది. టీడీపీ కార్యాలయం ధ్వంసం కేసులో గతేడాది సెప్టెంబర్‌లో సురేష్‌ను అరెస్ట్ చేశారు. అ తర్వాత మరియమ్మ హత్య కేసులో అక్టోబరు 7వ తేదీన పీటీ వారెంట్‌పై మరోసారి రిమాండ్‌కు తరలించారు. ఈ నెల 7న సుప్రీం కోర్టులో సురేష్ బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయ్యింది. ఈ నేపథ్యంలో.. గుంటూరు నాల్గో జిల్లా కోర్టులో సురేష్ తరపున న్యాయవాది తానికొండ చిరంజీవి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది.

గతేడాది సెప్టెంబర్ 5వ తేదీన సాయత్రం హైదరాబాద్‌లో ఆయన్ను అరెస్ట్‌ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో.. సురేష్‌ తోపాటు మరికొందరు వైసీ...