భారతదేశం, ఫిబ్రవరి 16 -- గుంటూరు జీజీహెచ్‌లో విద్యార్థినులపై లైంగిక వేధింపుల వ్యవహారం.. శనివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. ఐదుగురు విద్యార్థినులు త‌మ త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి.. గుంటూరు మెడిక‌ల్ కాలేజీ ప్రిన్సిప‌ల్ ఎన్‌.వి సుంద‌రాచారికి లిఖిత‌పూర్వ‌కంగా ఫిర్యాదు చేశారు. జీజీహెచ్‌లోని బ్ల‌డ్‌బ్యాంక్‌లో ప‌ని చేస్తున్న టెక్నికల్ సూపర్‌వైజర్ శివ శంకర్‌పై.. ల్యాబ్ టెక్నీషియ‌న్ కోర్సు చ‌దువుతున్న విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. త‌మ‌ను అన‌వ‌స‌రంగా తాకుతున్నాడ‌ని, లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని విద్యార్థినులు ఆరోపించారు.

బ్ల‌డ్‌బ్యాంక్‌లో రాత్రి స‌మ‌యంల్లో అవ‌స‌రం లేక‌పోయినా ఓ డాక్ట‌ర్ అక్క‌డ తిష్టవేసి.. త‌మ‌తో అస‌భ్య‌క‌రంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మ‌హిళ సిబ్బంది కూడా ఆరోపించారు. అందుకు బ్ల‌డ్‌బ్యాంక్‌లో చేతులు కోసుకున్న ఘ‌...