భారతదేశం, జనవరి 29 -- Guntakallu Mla: మాజీ మంత్రి, గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం రెచ్చిపోయారు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాసే వారిని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. గుంతకల్లు ఎమ్మెల్యే వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. మీడియాలో తన గురించి వార్తలు రాసే వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన గుమ్మనూరు జయరాం, తనపై వచ్చిన ఆరోపణల గురించి తన ముందే ప్రశ్నించాలన్నారు.

తనమీద, తన తమ్ముడిపై వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతానని హెచ్చరించారు. ఎవరికైనా సందేహాలు ఉంటే తనముందే ప్రశ్నలు వేయాలని వెనుక మాట్లాడొద్దని హెచ్చరించారు. ఏ ఛానల్ వారు అయినా తనను అడగాలని, తనకు ఎవరితో శతృత్వం లేదని, పట్టాలపై పడుకోబెడతారని తన మీద రాశారని, తాను తప్పు చేయనని, తన మీద, తన తమ్ముడి మీద వెనుక నుంచి అనొద్దని, నేరుగా అంటే సరిదిద్దుకుంటానని చెప్పారు.

తనపై వార్తలు రాసే ముందు అన్ని ...