భారతదేశం, డిసెంబర్ 9 -- Gunshots Heard in England Team Hotel: శుక్ర‌వారం (నేటి) నుంచి పాకిస్థాన్‌- ఇంగ్లాండ్ మ‌ధ్య ముల్తాన్ వేదిక‌గా రెండో టెస్ట్ ప్రారంభంకానుంది. తొలి టెస్ట్‌లో విజ‌యాన్ని సాధించి జోరు మీదున్న‌ది ఇంగ్లాండ్‌. సెకండ్ టెస్ట్‌లో గెలిచి సిరీస్ కైవ‌సం చేసుకోవాల‌నే ఉత్సాహంతో బ‌రిలో దిగుతోంది. మ‌రోవైపు సొంత గ‌డ్డ‌పై ఎదురైన ప‌రాభ‌వానికి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని పాకిస్థాన్ భావిస్తోంది.

ఈ టెస్ట్ మ్యాచ్ కోసం ఇరుజ‌ట్లు స‌న్న‌ద్ధ‌మ‌వుతోన్న త‌రుణంలో ఇంగ్లాండ్ ఆట‌గాళ్లు బ‌స చేస్తోన్న హోట‌ల్‌కు అత్యంత స‌మీపంలో తుపాకీ కాల్పుల శ‌బ్దాలు వినిపించ‌డం క‌ల‌క‌లం రేపింది. గురువారం ఉద‌యం ఇంగ్లాండ్ ఆట‌గాళ్లు ప్రాక్టీస్ సెష‌న్ కోసం రెడీ అవుతోన్న‌ స‌మ‌యంలో ఈ కాల్పుల శ‌బ్దాలు వినిపించాయి.

దాంతో ఆట‌గాళ్ల భ‌ద్ర‌త‌ను మ‌రింత ప‌టిష్టం చేశారు. కాల్పుల ఘ‌ట...