భారతదేశం, ఏప్రిల్ 22 -- ప్ర‌భావ‌తి పార్ల‌ర్‌ను రోహిణి అమ్మేసింద‌ని, ఆమె ఇప్పుడు పార్ల‌ర్‌కు ఓన‌ర్ కాద‌నే విష‌యం కుటుంబ స‌భ్యుల‌కు చెప్ప‌లేక‌, త‌న‌లో దాచుకోలేక స‌త‌మ‌త‌మువ‌తాడు బాలు. నేను కారుకు ఓన‌ర్ క‌దా...కానీ కాదు. పేరు ఉంటుంది కానీ నేను ఓన‌ర్ కాదు...కొంత‌మందికైతే అదీ ఉండ‌దు అని బాలు అంటాడు. అస‌లు మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావ‌డం లేద‌ని మీనా అంటుంది.

ప్ర‌భావ‌తి నిద్ర‌కు డిస్ట్ర‌బ్ కావ‌డంతో అర్ధ‌రాత్రి వేళ మీ గోల ఏంటి అని అంటుంది. గండుపిల్లి అరుస్తుంది నిద్ర‌పోదాం ప‌దా మీనా అని ప్ర‌భావ‌తి సెటైర్లు వేస్తాడు బాలు. వేళ కానీ వేళ తిండి ఏంటి అని బాలుతో అంటుంది ప్ర‌భావ‌తి. ఏడ‌వ‌కు వెళుతున్నాం అని బాలు కోపంగా అంటాడు.

ఆ పార్ల‌ర్ గొడ‌వ ఆప‌మ‌ని బాలును రిక్వెస్ట్ చేస్తాడు స‌త్యం. ఈ రాత్రికి ఆపేస్తాన‌ని బాలు అంటాడు. దేవుడా వీడి నోటికి తాళం వే...