Hyderabad, ఏప్రిల్ 4 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో నిద్ర లేచి వచ్చిన మనోజ్‌పై బాలు పంచ్‌లు వేస్తాడు. ఇంతలో ఓ విషయం మర్చిపోయానని చెప్పిన ప్రభావతి మీనాను పిలుస్తుంది. హారతి రెడీ చేయమంటుంది. ఎవరైనా ముత్తైదువులు వస్తున్నారా అని సత్యం అంటాడు.

మలేషియా నుంచి రోహిణి మావయ్య వస్తున్నారుగా. ఒట్టిగా లోపలికి తీసుకెళ్తే ఎలా. ఆ మాత్రం గౌరవం ఇవ్వకపోతే ఎలా అని ప్రభావతి అంటుంది. దాంతో బాలు కౌంటర్స్ వేస్తాడు. మీనాను రెడీ చేయమంటే సరే అంటుంది మీనా. ఈవిడ ఓవరాక్షన్ తట్టుకోలేకపోతున్నా. అసలు అతను వస్తున్నాడో లేదో తెలియట్లేదు. ఈవిడ మాత్రం వచ్చాక ఏం చేయాలో పెద్ద లిస్టే తయారుచేస్తుంది అని రోహిణి అనుకుంటుంది. రోహిణి మీ అత్త ఎంత హడావిడి చేస్తుందో చూశావా అని సత్యం అంటాడు.

మన పెళ్లి అయ్యాక నువ్ ఇంత హ...