Hyderabad, మార్చి 5 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో కేపీ పాలెంలో రోహిణి కోసం బాలు, మీనా, మనోజ్ వెతుకుంటారు. మనోజ్‌పై బాలు సెటైర్లు వేస్తూనే ఉంటాడు. మనోజ్ ఓ చోట కారు ఆపమంటాడు. దాంతో బాలు ఆపుతాడు. పౌరుషం పొడుచుకొచ్చిందా.. దిగరా.. దిగరా.. అని బాలు అంటాడు. దాంతో మనోజ్ దిగి ఇంతసేపు నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని వెళ్లిపోతుంటాడు.

వెళ్లురా.. వెళ్లు.. ఖర్చులకు కూడా డబ్బులు కూడా లేవు కదా నీ దగ్గర. ఇలాగే ఊరంతా నీ భార్యను వెతుకు అని బాలు అంటుంది. మీనా అలా అంటారేంటి అని అంటుంది. పని వదిలేసుకుని వీడికోసం వస్తే పనిపాట లేనోడికి కూడా పౌరుషం వస్తుంది. మనం వెళ్దాం పదా. ఇంత దూరం వస్తే కొంచెమైనా కృతజ్ఞత ఉందా వీడికి. మనకేం అవసరేం లేదు కానీ పద అని బాలు అంటాడు. ఇంతలో చింటు కొట్టిన బాల్ క...