Hyderabad, మార్చి 24 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో చంద్రకాంతమే తాళి దొంగతనం చేసి మీనాపై నెట్టిందని అంతా చెబుతుంది శ్రుతి. దాంతో ప్రభావతి షాక్ అవుతుంది. మీనాను అనడంపై సత్యం కోప్పడతాడు. ఆవిడకు డబ్బున్నోళ్లే గొప్పోళ్లు, వాడు అయితే డబ్బు ఇస్తానంటే రోజు ఇంటికి వెళ్లి కడుగుతాడు కాళ్లు. అయినా ఇప్పుడు చెబుతున్నావేంటీ డబ్బుడమ్మా. అప్పుడే చెబితే అయిపోయేదిగా అని బాలు అంటాడు.

చెబితే ఏం చేసేవాళ్లు. గొడవ చేసేవాళ్లు. దాంతో ఆ సంజయ్ తిరిగి పెద్దది చేసేవాడు. ఇద్దరు కలిసి కొట్టుకునేవాళ్లు. మీ అందరి మధ్యలో మన మౌనిక ఎంత నలిగిపోతుందో ఆలోచించారా. గోల్డ్ దొరికాక ఆవిడ ఎంతలా మారిపోయిందో చూశారుగా. బయటకు తీసుకెళ్లి బండబూతులు తిట్టాను. ఎక్కువ చేస్తే వీడియో బయటపెడతాను అన్నావ్. దాంతో పిల్లికూన అయిందన...