Hyderabad, మార్చి 4 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో రోహిణి గురించి బాలుకు ఫోన్ చేసి అడిగితే.. కేపీ పాలెం వెళ్లినట్లు చెబుతున్నారు. డీజిల్ తక్కువ ఉంది. డబ్బులు తీసుకుని రా కలిసి వెళ్దాం అని బాలు అంటాడు. తర్వాత మీనాను కలుస్తారు బాలు, మనోజ్.

మీనా దగ్గర డబ్బులు తీసుకుని మీనాను ఫ్రంట్ సీట్‌లో కూర్చొబెట్టి.. మనోజ్‌ను వెనుక సీట్లోకి పంపిస్తాడు బాలు. రోహిణిని ఎలాగైనా తీసుకురుమ్మని మామయ్య మరి మరి చెప్పారు అని మీనా అంటుంది. ఆవిడేమైనా పార్లర్లో దొరికే పౌడరా.. పార్లర్‌కు ఓనర్. అలిగి వెళ్లిపోయింది. వీడి టైమ్ బాగుంటే దొరుకుతుంది లేకుంటే లేదు అని బాలు అంటాడు. లేదా మలేషియా వెళ్లింటుందా అని మీనా డౌట్ పడుతుంది. ఇప్పుడు అక్కడికి కూడా వెళ్లి వెతకాలా అని బాలు అంటాడు.

తను కేపీ పాలెం వెళ్లిందన...