Hyderabad, ఫిబ్రవరి 19 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో పొట్టి బట్టలు వేసుకోవడంపై శ్రుతికి నచ్చజెబుతుంది మీనా. దాంతో శ్రుతి వెళ్లిపోతుంది. ఇదేంటీ ఆంటీ మీనా ఇలా చెప్పగానే శ్రుతి అలా వెళ్లిపోయింది అని ప్రభావతితో రోహిణి అంటుంది. అదే నాకు అర్థం కానిది. అసలు ఈ పూలు అమ్ముకునేదానికి ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చి చచ్చాయి అని ప్రభావతి అంటుంది.

నిజం చెప్పాలంటే శ్రుతి చెప్పేది కూడా నిజమే డ్రెస్ అనేది వేసుకునేవాళ్ల మీద ఉంటుంది. చూసేవాళ్ల మీద కాదు అని రోహిణి అంటుంది. కాసేపటి తర్వాత ఫుల్ కవర్‌డ్ బ్లాక్ డ్రెస్సులో శ్రుతి వచ్చి అందరిని ఓకేనా అని అడుగుతుంది. నువ్ ఏ డ్రెస్ వేసుకున్నా అందంగా ఉంటావ్ అని మీనా అంటుంది. మరుసటి రోజు ఉదయం ఉతకడానికి బట్టలు చూసి నిట్టూరూస్తుంది. ఏంటీ అత్తయ్య అన్ని ఒకే...