Hyderabad, ఏప్రిల్ 10 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో సుశీల ఇంట్లో తనకు తల్లి లేదని రోహిణి బాధపడుతుంది. మేమున్నాం అంటూ మీనా, శ్రుతి ఓదార్చుతారు. నేను నీకు తల్లిగా ఉన్నాని ప్రభావతి అంటుంది. దానికి సుశీల ప్రభావతికి క్లాస్ తీసుకుంటుంది.

ఒక్క రోహిణిని మాత్రమే కాదు. ముగ్గురు కోడళ్లను సమానంగా చూసుకోవాలి అని ప్రభావతితో అంటుంది. రోహిణికి తల్లి లేదు, మీనాకు తండ్రి లేడు, శ్రుతికి ఇద్దరు ఉన్నారు. కానీ, ఎవరు మీతో రారు. మీ అత్తమామలననే తల్లిదండ్రులుగా చూసుకునే బాధ్యత మీకు కూడా ఉంది. అత్తమామలను చూసుకుంటే తనకంటే ఎక్కువ పూజించినట్లుగా దేవుడు భావిస్తాడట అని సుశీల అంటుంది. దాంతో ముగ్గురు తల ఊపుతారు.

తర్వాత ప్రభావతిని నీ ముగ్గురు కొడుకులు సరిగా లేరు. ఒకరికి ఒకరంటే పడదు. ఎందుకు నువ్ వాళ్లను ...