Hyderabad, ఫిబ్రవరి 28 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో మనోజ్ పార్క్ విషయం బయటపెట్టడంతో ప్రభావతిని తిడతాడు సత్యం. వీడు ఉద్యోగం పోగొట్టుకుని పార్క్‌లో బికారిలా తిరుగుతుంటే చెప్పవా. సిగ్గులేదా అని సత్యం అంటాడు. నీ పెద్ద కొడుకు గురించి గొప్పగా చెప్పేదానివి ఎందుకు అని బాలు అంటాడు.

వీడు ఉద్యోగం పోగొట్టుకోవడం కొత్త కాదు నాన్నా. నేను కారు అమ్మేసి ఇంట్లో ఏమన్నాడు. నన్ను బారులో పని చేయమన్నాడు. నాకు అదే సరైన ఉద్యోగం అన్నాడు. మరి సార్ ఏం పని చేస్తున్నాడు. పార్క్‌కు వచ్చే వాళ్ల పళ్లు తోముతున్నావా. లేదా అక్కడ చెత్త ఊడుస్తున్నావా. అలాంటి పని చేసిన గౌరవంగానే ఉంటుందిరా. ఇలా మమ్మల్ని వెర్రివాళ్లను చేశావ్ కదరా. ఛీ.. నీది ఓ బతుకేనా అని బాలు అంటాడు. అనుకోకుండా షో రూమ్‌కి వెళ్తే కారు కొననివ్వక...