Hyderabad, ఏప్రిల్ 11 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో ముగ్గురు కోడళ్లను బాగా చూసుకోమ్మని ప్రభావతికి క్లాస్ పీకుతుంది సుశీల. నాకు అమ్మ ఉంది కాబట్టి మీరు అత్తలాగే ఉండండి అని ప్రభావతికి శ్రుతి పంచ్ వేస్తుంది. మరోవైపు అన్నదమ్ములంతా చెరుకు తింటుంటారు.

చెరుకు కొరకలేకపోతున్నాను. జ్యూస్ చేసి తీసుకొస్తావా అని రవిని అడిగితే.. బాలు ఇంత వయసు వచ్చింది. ఆ మాత్రం కొరకలేవా. ఒంట్లో శక్తి లేదు పంట్లో శక్తి లేదు. ఏ మనిషివిరా అని బాలు అంటాడు. జ్యూస్ ఎప్పుడు తాగేదే కదా. ఇలా తిను అని రవి అంటాడు. ఇంతలో మాణిక్యం వస్తాడు. ఇదిగే మేకరావు గారు వచ్చారు. కూర్చోండి మేకగారు అని బాలు అంటాడు. మీ మేనకోడలి మొగుడు గారు చెరుకు కొరకలేకపోతున్నారు అని బాలు అంటే.. ఇదే కొరకలేకపోతే రేపు పూలుగు ఎముకని ఎలా కొరుకుతారు...