భారతదేశం, ఏప్రిల్ 14 -- గుండె నిండా గుడి గంటలు నేటి (ఏప్రిల్ 14) నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. కాఫీ గ్లాసు తీసుకొని వస్తుంటుంది ప్రభావతి. అడిగితే నేను ఇచ్చేదాన్ని కదా అత్తయ్య అని మీనా అంటుంది. పని చెబుతోందని మా అత్తయ్యతో తిట్టించి, సంతోషించడానికా అని వెటకారంగా మాట్లాడుతుంది ప్రభావతి. దీంతో మీనా కూడా పంచ్ వేస్తుంది. ఇదంతా పెద్దావిడను చూసే కదా అని ప్రభావతి అనుకుంటుంది. ఇంటికి వెళ్లాక మనోజ్‍కు తాగించినందుకు బాలు గాడికి, దీనికి మాములుగా ఉండదు అని అంటుంది. ఇంతల ఆ కాఫీ గ్లాసును సత్యం తీసుకోబోతే.. ఇది మలేషియా మరిది (మాణిక్యం) కోసం అని అంటుంది ప్రభావతి.

డబ్బు ఉన్న వారికే మర్యాదలా అని బాలు అంటాడు. మేకరాజు.. మేకరాజు అని మేకలా అరుస్తాడు. దీంతో ఎక్కడ.. ఎక్కడ అంటూ కంగారుగా వస్తాడు మాణిక్యం. కాఫీ, పురుగుల మందు అంటూ తన మాటలతో మాణిక్యాన్ని కన్‍ఫ్యూజ్ ...