Hyderabad, ఏప్రిల్ 7 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో రోహిణి మావయ్యగా మటన్ కొట్టు మాణిక్యం ఎంట్రీ ఇస్తాడు. మలేషియా నుంచి అతను వచ్చినట్లు రవి, శ్రుతి అనుమానపడతారు. బాలు సెటైర్లు వేస్తాడు. మీనా హారతి తీసుకురా అని ప్రభావతి అంటే.. రోహిణి తెస్తుందని చెబుతుంది.

కుడితిలో పడ్డ ఎలుకలా ఉన్నాడు. ఇప్పుడేం హారతి గానీ ముందు వెళ్లి స్నానం చేసి రమ్మను అని సుశీల అంటుంది. దాంతో బాత్రూమ్‌కు దారి చూపించి వెళ్లమంటుంది రోహిణి. మాణిక్యం వెళ్తాడు. బాలుతోపాటు అంతా తెగ నవ్వుకుంటారు. మా మావయ్యకు పల్లెటూరు కొత్త ఎలా నవ్వుతున్నారో చూడండి అని రోహిణి అంటుంది. తర్వాత మీ మావయ్య ఏం తింటారు అని పెద్ద లిస్ట్ చెబుతుంది ప్రభావతి. ఇది ఆయన వింటే నువ్ హోటల్‌లో వెయిటర్‌గా చేసినట్లున్నావ్ అనుకుంటాడని సత్యం అంటాడు....