Hyderabad, ఫిబ్రవరి 27 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో బాలు ఇంట్లోకి హడావిడిగా వచ్చి అందరిని పిలుస్తాడు. నాన్నా.. నాన్నా భార్య.. మీనా.. మీనా భార్యా.. లక్షలు మింగినోడా.. వాడి భార్య.. లేచిపోయినోడా.. వాడి భార్యా.. అంటూ గోల చేస్తాడు బాలు. ఇంతలో అందరు వస్తారు.

అమ్మా ఏది.. నాకు అమ్మా కావాలి అని చిన్న పిల్లాడు ఏడ్చినట్లుగా చేస్తాడు బాలు. చిన్న మెదడు చిట్లిందా. ఏమైందని ప్రభావతి అంటుంది. నీకు ఏం కాకూడదని దేవుడుని కోరుకుంటున్నాను అని బాలు అంటాడు. అమ్మా మనోజ్ మాతా, పార్లరమ్మా అత్తా ఈ ముఖ్య కార్యక్రమానికి చీప్ గెస్ట్ నువ్వే అని బాలు అంటాడు. చీప్ కాదు చీఫ్ అని రవి అంటాడు. చీపే కరెక్ట్ అని బాలు అంటాడు. అసలు ఏమైందిరా అని సత్యం అంటాడు.

కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు నాకోటి దొరికింది అ...