Hyderabad, మార్చి 20 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో నీలకంఠం కుటుంబానికి మీనా భోజనం వడ్డిస్తుంది. అడుగడుగునా అవమానించిన కాంతం కావాలనే తనపై సాంబార్ పడేలా చేస్తుంది. దాంతో అంతా షాక్ అవుతారు.

ఏయ్ నువ్ అసలు మనిషివేనా. కళ్లు నెత్తిమీద పెట్టుకున్నావా ఏంటీ. వడ్డించే పద్ధతి ఇదేనా అని కాంతం అంటుంది. డైనింగ్ టేబుల్ మ్యానర్స్ అందరికీ తెలియదులే అత్త అని సంజు అంటాడు. ఏం తెలియదురా. ఈమె మొగుడుకి ఎంత పొగరు ఉందో అంతే తనకు ఉంది. కావాలనే మీద సాంబార్ పోసింది అని కాంతం అంటుంది. బాలును సత్యం కంట్రోల్ చేయడం సంజు చూస్తాడు.

రారా నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నువ్ గొడవ పడాలి. నేను నిన్ను తన్నాలి. నువ్ నన్ను తన్నాలి. తర్వాత నీ మొహం నీ చెల్లి జీవితంలో చూడకుండా చేస్తా అని సంజు అనుకుంటాడు. నేను కావాలన...