Hyderabad, మార్చి 10 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో ఇదివరకు పని చేసిన కంపెనీకి వెళ్లి మనోజ్ జాబ్ గురించి అడుగుతాడు. ఒక్కసారి అవమానించినవాడిని జాబ్‌లో పెట్టుకోరు. మిమ్మల్ని తీసుకుంటే ఇక్కడ పనిచేసేవాళ్లు మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదనుకుంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాళ్లు ఎవరు చేయరు అని ఆమె అంటుంది.

మనోజ్ ఎంత బతిమిలాడిన ఆమె ఒప్పుకోదు. దాంతో ఏం చేయలేక మనోజ్ వెళ్లిపోతాడు. మరోవైపు ఇంట్లో మీనాను పిలుస్తాడు బాలు. పూలకొట్టు వదిలేసి ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని బాలు అంటాడు. మధ్యాహ్నాం అయిందిగా. అన్నం వండి తినేసి వెళ్దామని మీనా అంటుంది. కలెక్టర్ జాబ్ వచ్చిన నువ్ వంటిల్లు వదలవా. నువ్ మాత్రమే ఉన్నావా. ఇంకా ఆడవాళ్లు లేరా అని బాలు అంటాడు. నేను వాళ్లకోసం చేస్తున్నానా. మా ఆయన కోసం చేస్తున్నా....