భారతదేశం, మార్చి 13 -- సంజుకు తెలియ‌కుండా తాను పుట్టింటికి వెళ్లిన సీక్రెట్ బ‌య‌ట‌ప‌డ‌టంతో మౌనిక కంగారు ప‌డుతుంది. స‌త్యం, ప్ర‌భావ‌తి వెళ్లిపోగానే మౌనిక ద‌గ్గ‌ర‌కు వ‌స్తాడు సంజు. మొగుడు క‌ళ్లు క‌ప్పి అన్న క‌ళ్ల‌ల్లో ఆనందం చూడ‌టానికి పుట్టింటికి వెళ్లిన ఓ గొప్ప చెల్లి హ్యాట్సాఫ్ అని అంటాడు. అత్తా కోడళ్లు క‌లిసి మ‌మ్మ‌ల్ని వెధ‌వ‌ల‌ను చేశార‌ని అంటాడు. చెబితే పంపించార‌ని చెప్ప‌కుండా వెళ్లాన‌ని బ‌య‌ప‌డుతూ మౌనిక బ‌దులిస్తుంది. నాకు చెప్ప‌కుండా ఎక్కడెక్క‌డికి వెళ్లివ‌స్తున్నావ‌ని మౌనిక‌ను నిల‌దీస్తాడు సంజు.

అప్పుడే అక్క‌డికి ఎంట్రీ ఇచ్చిన సువ‌ర్ణ‌...సంజు చెంప ప‌గ‌ల‌గొడుతుంది. దేవ‌త‌లాంటి భార్య‌ను అనుమానిస్తే క‌ళ్లు పోతాయ‌ని, ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకొని మాట్లాడ‌మ‌ని కొడుకును వార్నింగ్ ఇస్తుంది. అస‌లు నీ వ‌ల్లే మౌనిక‌కు ఇంత ధైర్యం వ‌చ్చింద‌ని, బ్యాక...