భారతదేశం, ఫిబ్రవరి 17 -- Gunde Ninda Gudi Gantalu Serial: కారు కొన‌డానికి మ‌నోజ్ ప‌నిచేస్తున్న షోరూమ్‌కు వెళ‌తారు ర‌వి, శృతి. కానీ అక్క‌డ మ‌నోజ్ పేరుతో ఎవ‌రూ ప‌నిచేయ‌డం లేద‌ని షోరూమ్ ఎంప్లాయిస్ చెబుతారు. మ‌నోజ్‌కు ఫోన్ చేస్తాడు ర‌వి. కొత్త‌గా జాబ్‌లో జాయిన్ అయిన ఉద్యోగులు త‌న‌ను గుర్తుప‌ట్ట‌లేద‌ని, తానే హెడ్ ఆఫీస్‌లో ఉన్నాన‌ని అబ‌ద్దం చెప్పి త‌ప్పించుకుంటాడు మ‌నోజ్‌.

ఇంటికొచ్చిన మనోజ్తో అడ్డంగా నువ్వు దొరికిపోయావ‌నుకున్నాన‌ని ప్ర‌భావ‌తి అంటుంది. నిన్ను బాలుతో పాటు రోహిణి కూడా బోనులో నిల‌బెట్టి ఆడుకునేవారని అంటుంది. ముఖ్యంగా శృతికి ఈ నిజం తెలిస్తే మోసం చేశాన‌ని త‌న‌కు రోహిణికి విడాకులు ఇప్పించిన ఇప్పిస్తుంద‌ని మ‌నోజ్ కంగారుప‌డ‌తాడు. ఏదో ఒక ఉద్యోగం మాత్రం వెతుక్కోమ‌ని కొడుకుకు స‌ల‌హా ఇస్తుంది. అప్పుడే రోహిణి ఇంట్లోకి రావ‌డంతో టాపిక్ మార్చే...