భారతదేశం, మార్చి 28 -- Gunde Ninda Gudi Gantalu Serial: స‌త్యం ఫ్యామిలీ సుశీల ఊరికి బ‌య‌లుదేరుతారు. దారి పొడ‌వునా కారులో బాలుతో గొడ‌వ‌ప‌డుతూనే ఉంటుంది ప్ర‌భావ‌తి. త‌ల్లి మాట‌ల‌కు ధీటుగా బాలు బ‌దులిస్తుంటాడు. బాలు కారులో వ‌చ్చి త‌ప్పు చేశాన‌ని ప్ర‌భావ‌తి అంటుంది. నా కారులో కాబ‌ట్టి నిన్ను ఇంకా కూర్చోబెట్టుకున్నామ‌ని, అదే మ‌నోజ్ కారులో అయితే ఈ పాటికి మ‌ధ్య‌లోనే నింపు దింపేవార‌ని బాలు అంటాడు. కొంద‌రు మ‌నుషులు పాముల‌ కంటే డేంజ‌ర్‌, న‌చ్చ‌ని వాళ్ల‌పై విషం చిమ్ముతూనే ఉంటార‌ని త‌ల్లిపై సెటైర్లు వేస్తాడు బాలు. నువ్వు ఎవ‌రిని అంటున్నావో నాకు తెలుసున‌ని ప్ర‌భావ‌తి అంటుంది. ఇప్ప‌టికైనా అర్థం చేసుకున్నావు సంతోషం అని బాలు స‌మాధాన‌మిస్తాడు.

ప‌స‌ర్ల‌పూడిలో త‌న చిన్న‌నాటి స్నేహితులు క‌నిపించ‌డంతో స‌త్యం సంబ‌ర‌ప‌డ‌తాడు. త‌న స్నేహితుల యోగ‌క్షేమాలు క‌నుక్క...