భారతదేశం, ఫిబ్రవరి 26 -- పూల దండ‌ల కోసం అర్థ‌రాత్రి ఇద్ద‌రు వ్య‌క్తులు వ‌చ్చి త‌లుపు కొడ‌తారు. దండ‌లు లేవు ఏం లేవు వెళ్లిపొమ్మ‌ని వాళ్ల‌ను క‌సురుకుంటుంది ప్ర‌భావ‌తి. నేను మీకు పూలు అమ్మే దానిలా క‌నిపిస్తున్నానా అని అంటుంది. ప్ర‌భావ‌తి అంటే ఎవ‌రు అని వ‌చ్చిన వాళ్లు అడుగుతారు. నేను అని బ‌దులిస్తుంది. అయితే పూల‌ షాప్‌కు మీ పేరే ఉంది క‌దా అని వాళ్లు అంటారు. అది నా పేరుకు ప‌ట్టిన ద‌రిద్ర‌మ‌ని, ప్రొప్రైట‌ర్ లేద‌ని పూలు అమ్మ‌డం కుద‌ర‌ద‌ని వ‌చ్చిన వాళ్ల‌తో కోపంగా అంటుంది ప్ర‌భావ‌తి.

పూలు అమ్మేదానివి నీకు అంత కోపం ప‌నికిరాద‌ని క‌స్ట‌మ‌ర్స్‌ క్లాస్ ఇస్తారు. పెద్ద కోటీశ్వ‌రురాలిగా బిల్డ‌ప్‌లు ఇస్తున్నావేంటి అని ప్ర‌భావ‌తి గాలి తీసేస్తారు. మీనా పూల కొట్టువ‌ల్లే త‌న‌కు ఇన్ని క‌ష్టాలు అని కోపంతో చిందులు తొక్కుతుంది. . మీనా షాప్‌కు ముగింపు ఇవ్వాల‌ని ప్...