భారతదేశం, మార్చి 6 -- రోహిణి కోసం ఊరంతా త‌న‌ను తిప్పిన మ‌నోజ్‌పై బాలు ఫైర్ అవుతాడు. ఏ ప‌ని పాట లోన‌డా, న‌ల‌భై ల‌క్ష‌లు మింగినోడా అంటూ క్లాస్ ఇస్తాడు. అప్పుడే అక్క‌డికి స‌డెన్‌గా ఎంట్రీ ఇచ్చిన రోహిణి ఆపండి అని అరుస్తుంది. రోహిణిని చూసి బాలు, మీనాతో పాటు మ‌నోజ్ షాక‌వుతారు. బాలు, మీనా కంటే ముందే ఇంటికొచ్చేస్తుంది రోహిణి. ఇదేం ట్విస్ట్‌...ఇంట్లో వెత‌క్కుండా మ‌మ్మ‌ల్ని ఊరంతా తిప్పించావా అని మ‌నోజ్‌తో కోపంగా అంటాడు బాలు.

రోహిణిని చూడ‌గానే మ‌నోజ్ ఎమోష‌న‌ల్ అవుతాడు. నువ్విక రావేమోన‌ని భ‌య‌ప‌డ్డాన‌ని అంటాడు. నువ్వు చేసిన ప‌నికి రాకూడ‌ద‌నే అనుకున్నాను. కానీ నాకు ఇక్క‌డ నాకు దిక్కు ఎవ‌రున్నారు. ఎవ‌రికి వెళ్లి చెప్పుకోవాలి. అత్త‌య్య‌, మావ‌య్య‌లే నాకు అన్ని...అందుకే తిరిగి వ‌చ్చాన‌ని సెంటిమెంట్ డైలాగ్స్ కొడుతుంది రోహిణి.నా వ‌ల్లే నీ భార్య ఇంట్లో నుంచ...