భారతదేశం, మార్చి 7 -- Gunde Ninda Gudi Gantalu: మ‌నోజ్ ఇంట‌ర్వ్యూకు బ‌య‌లుదేరుతాడు. మ‌నోజ్ కోసం కొత్త ష‌ర్ట్ కొంటుంది రోహిణి. ఆ ష‌ర్ట్ చూసి మ‌నోజ్ హ్యాపీగా ఫీల‌వుతాడు. భ‌ర్త గౌర‌వాన్ని పెంచేది భార్య అనిపించేంత బాగుంద‌ని రోహిణి కొన్న ష‌ర్ట్‌కు కాంప్లిమెంట్ ఇస్తాడు మ‌నోజ్‌.ఇలా జాబ్ లేకుండా ఎంత కాలం ఉండిపోతావ‌ని మ‌నోజ్‌కు క్లాస్ ఇస్తుంది రోహిణి.

నువ్వు మేథావి అనే ఫీలింగ్‌ను తీసేయ‌మ‌ని అంటుంది. న‌చ్చిన జాబ్ దొరికేవ‌ర‌కు వ‌చ్చిన జాబ్ చేయ‌మ‌ని చెబుతుంది. జాబ్ లేని మ‌గాడిని సొసైటీ గౌర‌వించ‌ద‌ని అర్థ‌మ‌య్యేలా వివ‌రిస్తుంది. రోహిణి మాట‌ల‌తో రియ‌లైజ్ అవుతాడు మ‌నోజ్‌.

మ‌నోజ్‌కు జాబ్ రావాల‌ని పూజ చేస్తుంది ప్ర‌భావ‌తి. బోట్టు పెడుతుంది. అప్పుడే అక్క‌డికి బాలు ఎంట్రీ ఇస్తాడు. ఇప్పుడు వీడు బాహుబ‌లి యుద్ధానికి ఏమైనా వెళుతున్నాడా? వీర‌మాత వీర తిల‌కం దిద...