భారతదేశం, ఏప్రిల్ 1 -- Gunde Ninda Gudi Gantalu Serial: శృతికి కూర‌గాయ‌లు త‌రిగే ప‌ని అప్ప‌చెబుతుంది ప్ర‌భావ‌తి. గుమ్మ‌డికాయ‌ను క‌త్తి బ‌లంగా న‌రుకుతుంది శృతి. ఓ ముక్క ఎగిరివ‌చ్చి ప్ర‌భావ‌తి త‌ల‌పై ప‌డుతుంది. దాంతో ప్ర‌భావ‌తి ల‌బోదిబోమ‌ని కేక‌లు వేస్తూ స్పృహ కోల్పోతుంది. అత్త ముఖంపై నీళ్లు చ‌ల్లి లేపుబోతుంది రోహిణి.

కానీ కారం దంచిన చేతులు కావ‌డంతో ప్ర‌భావ‌తి ముఖం మండిపోవ‌డంతో గ‌గ్గోలు పెడుతుంది. రోహిణి కారం బాగా దంచ‌డం చూసి ప్ర‌భావ‌తి డౌట్ ప‌డుతుంది. నీకు కారం దంచ‌డం రాదు క‌దా, అంత ప‌ర్‌ఫెక్ట్‌గా ఎలా చేశావ‌ని ప్ర‌భావ‌తి, శృతి డౌట్ ప‌డ‌తారు. రోహిణి టాపిక్ డైవ‌ర్ట్ చేస్తుంది.

కూర‌గాయ‌లు నేను క‌ట్ చేస్తాన‌ని, నువ్వు ప‌క్క‌న కూర్చోమ‌ని శృతితో చెబుతుంది ప్ర‌భావ‌తి. అయినా విన‌కుండా బంగాళ‌దుంప‌లు క‌ట్ చేయ‌బోతుంది శృతి. వేలు తెగుతుంది. ర‌క్తం అ...