భారతదేశం, మార్చి 25 -- త‌న మావ‌య్య‌గా మ‌ట‌న్ కొట్టు మాణిక్యం చేత డ్రామా ఆడించాల‌ని రోహిణి ఫిక్స‌వుతుంది. రాజ‌మౌళి సినిమాలో ఆఫ‌ర్ అంటూ మాణిక్యాన్ని విద్య‌, రోహిణి క‌లిసి బురిడీ కొట్టిస్తారు. సినిమా షూటింగ్‌కు ముందు కొద్ది రోజులు రోహిణికి మావ‌య్య‌గా న‌టించ‌డానికి ఓ ప‌ల్లెటూరికి రావాల‌ని మాణిక్యానికి కండీష‌న్ పెడుతుంది విద్య‌. మేడ‌మ్ కూడా న‌టిస్తారా అని రోహిణిని చూపిస్తూ మాణిక్యం అడుగుతాడు. మామూలు న‌టి కాదు మ‌హాన‌టి అని విద్య అంటుంది. వారి మాట‌ల‌తో మాణిక్యం డౌట్ ప‌డ‌తాడు.

ఇదేదో దొంగ నాట‌కంలా ఉంద‌ని, మీరు ఇద్ద‌రు క‌లిసి ఎవ‌రో మోసం చేస్తున్న‌ట్లుగా ఉంద‌ని మాణిక్యం అంటాడు. ఇందులో ఎలాంటి మోసం లేద‌ని, రాజ‌మౌళి సినిమాలో ఆడిష‌న్‌లో ఇదంతా ఓ భాగ‌మ‌ని, నీతో పాటు అక్క‌డ క‌నిపించేవారంతా యాక్ట‌ర్లేన‌ని మాణిక్యాన్ని విద్య న‌మ్మిస్తుంది.

సీక్రెట్ కెమెరాల...