భారతదేశం, మార్చి 21 -- Gunde Ninda Gudi Gantalu: తాళిబొట్టు దొంగతనం చేసి కారులో దాచేస్తుంది కాంతం. గొడ‌వ చేసి ఫంక్ష‌న్ ఆపేయాల‌ని ప్లాన్ చేస్తుంది. కానీ కాంతం తాళిబొట్టు కొట్టేయ‌డం శృతి చూస్తుంది. కాంతాన్ని ప‌క్క‌కు తీసుకెళ్లి దులిపేస్తుంది.

ఒసేయ్ దొంగ‌మొహ‌మా.... చీట‌ర్‌, నువ్వు అస‌లు మ‌నిషివేనా, ఆడ‌దానివేనా అని కాంతంపై విరుచుకుప‌డుతుంది. సంజు ఓ వెధ‌వ‌, వాడి తండ్రి ఓ పోరంబోకు అని అంటుంది.

మా మీనాను దొంగ అంటావా? మా మావ‌య్య‌ను, అత్త‌య్య‌ను చీప్‌గా చూస్తావా? అని కాంతాన్ని నిల‌దీస్తుంది శృతి. నేను ఎవ‌రో తెలుసా అని బిల్డ‌ప్పులు ఇస్తుంది కాంతం. తెలుసు నువ్వో దొంగ‌వి అని శృతి బ‌దులిస్తుంది. దొంగ అన‌గానే కాంతం త‌డ‌బ‌డుతుంది.

కావాల‌నే సాంబార్ మీద ప‌డేసుకొని మీనా రూమ్‌లోకి వెళ్లి తాళి కొట్టేయ‌డం నేను చూశాన‌ని శృతి అంటుంది. నేను దొంగ‌త‌నం చేయ‌డం ఏ...