భారతదేశం, మార్చి 18 -- Gunde Ninda Gudigantalu Serial: ప్ర‌భావ‌తి మాట‌ల‌కు క‌ట్టుబ‌డి మౌనిక ఫంక్ష‌న్‌కు ఉండ‌కుండా ఇంట్లోనుంచి వెళ్లిపోవ‌డానికి బాలు రెడీ అవుతాడు. సంజు ఫ్యామిలీ వ‌చ్చే టైమ్ అయినా బాలు టిఫిన్ చేస్తూ క‌నిపించ‌డంతో ప్ర‌భావ‌తి టెన్ష‌న్ ప‌డుతుంది. ఇడ్లీలు స‌రిపోక‌పోతే న‌న్ను కూడా కాల్చుకు తిన‌మ‌ని కోపంగా అరుస్తుంది.

నాకేం విన‌ప‌డ‌టం లేదు. క‌న‌ప‌డ‌టం లేద‌ని బాలు అంటాడు. నిన్ను క‌న్నందుకు నాకు ఈ మాన‌సిక క్షోభ ఏంట‌ని ప్ర‌భావ‌తి అంటుంది. ఈ రోజు మౌనిక ఫంక్ష‌న్ జ‌రిగిన‌ట్లేన‌ని అంటుంది. దండ పెడ‌తాను ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మ‌ని బాలుతో అంటుంది ప్ర‌భావ‌తి.

ఇంట్లో నుంచి వెళ్లిపోతున్న బాలును టిఫిన్ పేరుతో వెన‌క్కి పిలిచినిందుకు మీనాపై కారాలు మిరియాలు నూరుతుంది ప్ర‌భావ‌తి. తిన‌డానికి బ‌య‌ట టిఫిన్ సెంట‌ర్లు లేవా అని అంటుంది. ఇప్పుడు ఏమైంద‌...