భారతదేశం, మార్చి 3 -- మ‌నోజ్ చేసిన మోసాన్ని త‌ట్టుకోలేక‌పోతుంది రోహిణి. స్నేహితురాలు విద్య ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి త‌న గోడును వెళ్ల‌బోసుకుంటుంది. ఈ చిన్న విష‌యాన్ని భూత‌ద్ధంలో పెట్టి చూడొద్ద‌ని, నువ్వు చేసిన మోసం బ‌య‌ట‌పెడితే...ఈ రోజు నువ్వు అన్న మాట‌ల‌ను రిపీట్ చేసి ప‌దింత‌లు మ‌నోజ్‌ అంటాడ‌ని విద్య అంటుంది.

మ‌నోజ్‌కు జాబ్ లేద‌న్న విష‌యం ఇంట్లో అంద‌రికి తెలిసిపోయింద‌ని, బాలు త‌న‌ను చూసి న‌వ్వుతున్నాడ‌ని రోహిణి అంటుంది. బాలును ప‌ట్టించుకోవ‌ద్ద‌ని, అలాంటి వాళ్ల‌కు గ‌ట్టిగా స‌మాధానం చెప్ప‌మ‌ని విద్య స‌ల‌హా ఇస్తుంది. మ‌నోజ్ అబ‌ద్దాలు చెప్పి గాలి తిరుగుళ్లు తిరిగితే ఆ ఎఫెక్ట్ నాపై ప‌డుతుంద‌ని, ఇంట్లో నా విలువ త‌గ్గిపోతుంద‌ని రోహిణి బాధ‌ప‌డుతుంది.

ఇంటికి వెళ్లాల‌ని అనిపించ‌డం లేద‌ని అంటుంది. మ‌నోజ్ కోస‌మే ఆ ఇంట్లో వాళ్ల‌ను భ‌రిస్తున్నాన‌ని రోహిణి చ...