భారతదేశం, మార్చి 19 -- మౌనిక ఫంక్ష‌న్‌లో బాలును దారుణంగా అవ‌మానించాల‌ని అనుకుంటాడు సంజు. బాలు చేత కాళ్లు క‌డిగించుకోవాల‌ని ప్లాన్ వేస్తాడు. కానీ మీనా ఫిట్టింగ్ పెట్టి మ‌నోజ్ చేత సంజు కాళ్లు క‌డిగిస్తుంది.

బాలుగాడితో మ‌ళ్లీ గొడ‌వ‌ప‌డాల‌ని ఉందా? నేను బ‌య‌ట‌కు పంపించాల‌ని చూస్తే నువ్వేంటి ఉండ‌మంటున్నావ‌ని కొడుకును నీల‌కంఠం కోప్ప‌డుతాడు. బాలుకు బ‌య‌ట‌కు వెళ్లిపోతే కిక్కు ఉండ‌ద‌ని, ఈ రోజు అత్త చేసే అవ‌మానాల‌కు వాడు జీవితంలో మ‌ళ్లీ నోరు ఎత్త‌కూడ‌ద‌ని సంజు అంటాడు.

బాలు రౌడీల‌కు రౌడీలా అయితే నేను వాడి కంటే పెద్ద‌ కంత్రిన‌ని చంద్ర‌కాంతం అంటుంది. సంజుపై చేయిచేసుకున్న వాడిని నువ్వు ఒక్క రోజే ఇంట్లో లేకుండా చేయాల‌ని అనుకున్నావు. కానీ నేను వాడిని ప‌ర్మినెంట్‌గా ఇంట్లో నుంచి పంపిచేస్తాన‌ని, వాడి కుటుంబ‌స‌భ్యుల చేత‌నే బాలును ఛీ కొట్టేలా చేస్తాన‌ని అంట...