భారతదేశం, మార్చి 12 -- Gunde Ninda Gudi Gantalu Serial: మౌనిక‌కు తాళిబొట్టు ఫంక్ష‌న్ జ‌రిపించాల‌ని ప్ర‌భావ‌తి నిర్ణ‌యిస్తుంది. ఆ ఫంక్ష‌న్ కోసం రెండున్న‌ర ల‌క్ష‌లు ఖ‌ర్చు అవుతుంద‌ని, డ‌బ్బు ఎలా స‌ర్ధుబాటు చేయాలో తెలియ‌డం లేద‌ని స‌త్యం అంటారు. ఆ ఫంక్ష‌న్ కోసం డ‌బ్బులు తాము ఇస్తామ‌ని శృతి, రోహిణి అంటారు. ఎవ‌రూ ఏం ఇవ్వాల్సిన ప‌నిలేద‌ని, ఫంక్ష‌న్ కోసం అవ‌స‌ర‌మ‌య్యే డ‌బ్బు తానే అరెంజ్ చేస్తాన‌ని బాలు అంటాడు.

ఫంక్ష‌న్ కోసం నాన్న ఎవ‌రి ద‌గ్గ‌ర అప్పు చేయాల్సిన ప‌నిలేద‌ని, ఏ స‌న్నాసుల‌ను అడ‌గాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటాడు బాలు. స‌న్నాసి అన‌గానే మ‌నోజ్ కోపంతో ర‌గిలిపోతాడు. స‌న్నాసి అంటే లోకంలో నువ్వు ఒక్క‌డివే ఉన్నావా అని బాలు సెటైర్లు వేస్తాడు.

బాలును న‌మ్ముకుంటే ప‌రువు తీసుకున్న‌ట్లే అవుతుంద‌ని ప్ర‌భావ‌తి అంటుంది. మౌనిక ఫంక్ష‌న్ కోసం తాము డ‌బ్బులు...