భారతదేశం, మార్చి 27 -- స‌త్యం ఫ్యామిలీ మొత్తం క‌లిసి ప‌స‌ర్ల‌పూడి బ‌య‌లుదేరుతారు. శృతి మాత్రం ప‌ల్లెటూరికి రావ‌డానికి ఒప్పుకోదు. శృతిని బ‌తిమిలాడుతాడు ర‌వి. ముగ్గురు కోడ‌ళ్లు వ‌స్తున్నార‌నే ఆనందంలో నాన‌మ్మ ఉంద‌ని, నువ్వు రాలేద‌ని తెలిస్తే బాధ‌ప‌డుతుంద‌ని శృతితో ర‌వి అంటాడు. అయినా శృతి త‌గ్గ‌దు. ప‌ల్లెటూరికి వ‌స్తే త‌న‌కు హెల్త్ ప్రాబ్లెమ్స్ వ‌స్తాయ‌ని అంటుంది. ఈ నాలుగు రోజులు పుట్టింటికి వెళ‌తాన‌ని అంటుంది.

శృతి, ర‌వి వాద‌న‌ను చాటునుంచి ప్ర‌భావ‌తి వింటుంది. శృతిని ఎలాగైనా ఒప్పించి ప‌స‌ర్ల‌పూడి తీసుకెళ్లాల‌ని అనుకుంటుంది. ర‌వి ఒక్క‌డే ప‌ల్లెటూరికి వ‌స్తే చూసేవాళ్లు ఏదేదో ఊహించుకుంటార‌ని శృతితో అంటుంది. మీ వాళ్లు ఎవ‌రో ఒక‌రు రాకుండాపుట్టింటి వెళ్ల‌డం మంచిది కాద‌ని చెబుతుంది.

ప‌ల్లెటూరిలో నీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్య‌త త‌న‌ది అని ...