భారతదేశం, ఫిబ్రవరి 25 -- తొలిరోజే మీనా పూల కొట్టుకు మంచి లాభాలు రావ‌డంతో బాలు సండ‌ర‌ప‌డిపోతాడు. మొద‌టి అడుగులోనే అద‌ర‌గొట్ట‌వాని, నిన్ను ఎవ‌రూ ఆప‌లేర‌ని బాలు అంటాడు. మీరు నా ప‌క్క‌న ఉంటే నేను ఏదైనా సాధించ‌గ‌ల‌న‌ని అనిపిస్తుంద‌ని మీనా అంటుంది. నేను ఏదో పుణ్యం చేసుకొని ఉంటే మీరు నాకు దొరికారు. ఇలా నాకు తోడుగా నిల‌బ‌డ‌గ‌లిగారు అని భ‌ర్త‌తో అంటుంది మీనా.

పూల మాల‌లు ప‌క్క‌న పెట్టి ప‌డుకోమ‌ని మీనాతో అంటాడు బాలు. నాకు ప‌నుంద‌ని మీరు ప‌డుకోండ‌ని మీనా బ‌దులిస్తుంది. ఏంటి ఇంకో మాల‌ క‌ట్టాలా అని బాలు సైట‌ర్ వేస్తాడు. లేక‌పోతే మిమ్మ‌ల్ని చుట్టుకొని ప‌డుకోవాలా అని మీనా బ‌దులిస్తుంది. నాకు అంత అదృష్టం కూడానా అని బాలు అన‌గానే...భ‌ర్త‌ను కౌగిలించుకొని గిలిగింత‌లు పెడుతుంది. నాకు సిగ్గేస్తుంద‌ని వ‌దిలేయ‌మ‌ని బాలు అంటాడు. అప్పుడంటే నువ్వు వ‌ట్టి మీనావు......