భారతదేశం, ఏప్రిల్ 23 -- స్వీట్ బాక్స్ ప‌ట్టుకొని సంతోషంగా ఇంటికొస్తాడు మ‌నోజ్‌. అంద‌రిని పిలుస్తాడు. బాలు అక్క‌డి నుంచి వెళ్లిపోబోతుంటే ఆపుతాడు. మీ అంద‌రికి ఓ శుభ‌వార్త చెప్పాలి. ముఖ్యంగా ఈ డ్రైవ‌ర్‌కు అని బాలుతో వెట‌కారంగా అంటాడు మ‌నోజ్‌. ఈ రోజు నా చ‌దువుకు త‌గ్గ ఉద్యోగం దొరికింద‌ని కుటుంబ‌స‌భ్యులంద‌రితో మ‌నోజ్ చెబుతాడు. ఆ మాట‌లు విన‌గానే రోహిణి, ప్ర‌భావ‌తి ఆనంద‌ప‌డ‌తారు. నాకు చాలా సంతోషంగా ఉంద‌ని, నిన్ను అన్న‌వాళ్లు అంద‌రికి ట‌క్కున నోళ్లు మూత‌ప‌డేలా చేశావ‌ని బాలువైపు చూస్తూ ప్ర‌భావ‌తి అంటుంది.

నా మొద‌టిరోజు జీతంతో నీ కోసం హ‌ల్వా తెచ్చాన‌ని మ‌నోజ్ నోరు జారుతాడు. నీ జాబ్ ఏంటి అని మ‌నోజ్‌ను అడుగుతాడు బాలు. నా చ‌దువుకు త‌గ్గ ఉద్యోగం అని మ‌నోజ్ అబ‌ద్ధం చెబుతాడు. నువ్వు రోజు కూలీగా వెళుతున్నావా? ఏ రోజు జీతం ఆ రోజు ఇవ్వ‌డం ఏంటి బాలు ఆరాలు తీ...