భారతదేశం, మార్చి 8 -- మ‌నోజ్ ఇంట‌ర్వ్యూకు వెళ‌తాడు. భ‌ర్త కోసం రోహిణి కంగారుగా ఎదురుచూస్తుంటుంది. రోహిణి టెన్ష‌న్ చూసి ఏమైంద‌ని ర‌వి అడుగుతాడు. మ‌నోజ్ ఇంట‌ర్వ్యూకు వెళ్లిన సంగ‌తి చెబుతుంది. రెండు మూడు ఇంట‌ర్వ్యూలు ఉన్నాయ‌ని అన్నాడ‌ని, ఏదో ఒక జాబ్ క‌న్ఫామ్ అవుతుంద‌ని అనుకున్న‌ట్లు రోహిణి చెబుతుంది. ఒక్క రోజులో జాబ్ ఎలా దొరుకుతుంద‌ని శృతి అంటుంది.

శృతి మాట‌ల‌తో రోహిణి నొచ్చుకుంటుంది. తాను వేరేలా అడ‌గ‌లేద‌ని, బాలు మాదిరిగా అస్స‌లు అడ‌గ‌లేద‌ని అంటుంది.మీనా ఉండ‌టం చూసి మ‌నోజ్‌కు జాబ్ రాక‌పోతే మ‌మ్మ‌ల్ని బ‌త‌క‌నిచ్చేలా లేర‌ని కావాల‌నే రెచ్చ‌గొడుతుంది రోహిణి.

రోహిణి మాట‌ల‌తో మీనా కోపం ప‌ట్ట‌లేక‌పోతుంది. మ‌నిషి ఇంట్లో లేన‌ప్పుడు అత్త‌గారిలా మాట్లాడ‌టం ఎందుకు...ద‌మ్ముంటే...ధైర్యం ఉంటే బాలు ఉన్న‌ప్పుడే మాట్లాడ‌మ‌ని రోహిణితో ఛాలెంజ్ చేస్తుంది మీనా...