భారతదేశం, ఏప్రిల్ 18 -- Gunde Ninda Gudi Gantalu Serial: కామాక్షికి ఫోన్ చేసి ఓ సీక్రెట్ చెప్పాల‌ని, ఇంటికి ర‌మ్మ‌ని అంటుంది ప్ర‌భావ‌తి. ఇంట్లో అడుగుపెడుతూనే ఇంకా పూల కొట్టు తెర‌వ‌లేదా అని ప్ర‌భావ‌తిని అడుగుతుంది కామాక్షి. ఆ షాప్ పేరు ఎత్తితే నాకు కంప‌రంగా ఉంటుంద‌ని ప్ర‌భావ‌తి చిర్రుబుర్రులాడుతుంది. ర‌వి రూమ్‌లోకి వెళ్లి మాట్లాడుకుందామ‌ని కామాక్షితో అంటుంది ప్ర‌భావ‌తి.

ర‌వి రూమ్ ద‌గ్గ‌ర‌కు వెళ‌తారు ఇద్ద‌రు. అప్పుడే ర‌విని రూమ్ నుంచి బ‌య‌ట‌కు గెంటేసి త‌లుపు వేసేస్తుంది శృతి. న‌గ‌ల బాక్స్ తెచ్చిన కోడ‌లు క‌దా... అందుకే మొహం మీదే త‌లుపు వేసింద‌ని పంచ్‌లు వేస్తుంది కామాక్షి. ఈ పిల్ల‌తోనే క‌దా లేచిపోయిపెళ్లిచేసుకుంది అని ర‌వితో వెట‌కారం ఆడుతుంది కామాక్షి.

మీ అత్త‌య్య మొహం మీదే త‌లుపువేశావు, కొంచెం ఉంటే ముక్కు ప‌చ్చ‌డి అయ్యేద‌ని శృతితో కామాక్ష...