భారతదేశం, ఏప్రిల్ 17 -- త‌ల్లి ప్ర‌భావ‌తి త‌న‌ను ద్వేషించ‌డం వెనుక ఉన్న గ‌తం గుర్తుచేసుకుంటాడు బాలు. కానీ ఆ నిజం మాత్రం మీనాకు చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డ‌డు. క‌ష్ట‌ప‌డ‌ని కొడుకును, తండ్రికి ద్రోహం చేసే కొడుకును ప్రేమిస్తుంది. క‌ష్టం వ‌స్తే అండ‌గా నేను ఉన్నాన‌ని నిలిచే కొడుకును మాత్రం ప్ర‌భావ‌తి ద్వేషిస్తుంది. దానికి జ‌వాబు మా అమ్మ‌నాన్న‌ల ద‌గ్గ‌ర లేదు. నా ప్ర‌శ్న‌కు చాలా ఏళ్లుగా స‌మాధానం దొర‌క‌లేద‌ని బాలు ఎమోష‌న‌ల్ అవుతాడు.

చిన్న‌ప్ప‌టి నుంచి ఏది నాకు ద‌క్క‌లేద‌ని బాలు క‌న్నీళ్లు పెట్టుకుంటాడు. ఈ గ‌డ‌ప మీదే కూర్చొని ప్ర‌తి రోజు అమ్మ కోసం ఎదురుచూశాన‌ని, ఏదో ఒక రోజు అమ్మ వ‌చ్చి న‌న్ను ఇంటికి తీసుకెళుతుంద‌ని ఆశ‌తో కూర్చొనేవాడిని. కానీ మా అమ్మ ఎప్ప‌టికీ రాద‌ని అర్థం కావ‌డానికి చాలా కాలం ప‌ట్టింద‌ని బాలు అంటాడు.

అమ్మ ఉంది...అమ్మ‌తో నేను ఉన్నాను. ...