భారతదేశం, ఏప్రిల్ 9 -- ఉగాది రోజున వండిన ప్ర‌సాదం రుచి బాగుంద‌ని మాణిక్యం అంటాడు. త‌న భార్య మిగిలిపోయిన మ‌ట‌న్‌ ప్ర‌తిరోజు వండిపెడుతుంద‌ని, ఇలాంటి వంట‌కాలు ఎప్పుడు చేయ‌ద‌ని నోరుజారుతాడు.

అత‌డి మాట‌ల‌తో స‌త్యం ఫ్యామిలీ మొత్తం షాక‌వుతారు. మాణిక్యంపై బాలుకు ఉన్న డౌట్ మ‌రింత పెరుగుతుంది. మీరు వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి మేక మీద స‌వారీ చేస్తున్నారు. మ‌ట‌న్‌లోనే మునిగితేలుతున్నారు. మీరు మ‌ట‌న్ కొట్టు న‌డుపుతున్న‌ట్లు అనుమానంగా ఉంద‌ని అంటాడు.

నాకు మ‌ట‌న్ అంటే మ‌హా ఇష్టం, మేకను దేవ‌త‌గా ఫీల‌వుతాను అంటూ తెలివిగా మాట్లాడి నిజం బ‌య‌ట‌ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌తాడు మాణిక్యం. మీనాను పిలిచి ఆమెకు ప్రేమ‌గా ప్ర‌సాదం తినిపిస్తుంది సుశీల‌. మ‌రి నాకు అంటూ బాలు వ‌స్తాడు. నువ్వేమైనా ప‌సిపిల్లాడివా అని సుశీల అంటుంది. నీ చేతితో తిని చాలా రోజులైంది అని బాలు ప్రేమ‌గా అ...