భారతదేశం, ఏప్రిల్ 16 -- ప‌ల్లెటూళ్లో ఉన్న‌న్ని రోజులు స‌ర‌దాగా గ‌డ‌పాల‌ని స‌త్యం ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఫిక్స‌వుతారు. వారి చేత కొన్ని గేమ్స్ ఆడిస్తుంది సుశీల‌. ఇందులో భాగంగా ట్రూత్ అండ్ డేర్ గేమ్ ఆడ‌తారు. ఈ గేమ్‌లో భాగంగా శృతికి ఓ టాస్క్ ఇస్తాడు బాలు. మీ మ‌మ్మీకి ఫోన్ చేసి నీకు నిలువెళ్ల పొగ‌రు ఉంద‌ని, ఎందుక‌మ్మా అని అడ‌గ‌మ‌ని అంటాడు.

శృతిని పెళ్లిచేసుకున్న‌ప్పుడు మా అత్త న‌న్ను బాగా తిట్టింద‌ని, ఇప్పుడు ఫోన్ చేయాల్సిందేన‌ని ర‌వి ప‌ట్టుప‌డ‌తాడు. త‌ప్ప‌నిస‌రిగా శృతి త‌న త‌ల్లి శోభ‌న‌కు ఫోన్ చేసి బాలు చెప్పిన మాట అంటుంది. శృతి అన్న మాటలు విన‌గానే కోపంతో కూతురిపై ఎగిరిప‌డుతుంది. శోభ‌న‌.

ట్రూత్ అండ్ డేర్‌లో భాగంగా మ‌నోజ్‌కు టాస్క్ ఇస్తాడు బాలు. ఐ యామ్ ఆల్వెస్ డేర్ అని బిల్డ‌ప్‌లు ఇస్తాడు మ‌నోజ్‌. వీధి చివ‌ర‌లో ఉన్న మామిడి చెట్టు నుంచి ఓ కాయ‌ కో...