Hyderabad, మార్చి 22 -- Gunde Ninda Gudi Gantalu Serial: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమోలో బాలును అవమానించుదామని వచ్చిన సంజుకే ఘోర అవమానం జరుగుతుంది. అత్త చంద్రకాంతం రివర్స్ కావడంతో బాలు కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటాడు సంజు. తర్వాత జరిగిన అవమానం తట్టుకోలేక అక్కడ ఉండబట్టలేక వెళ్లి కారులో కూర్చుంటాడు.

తండ్రి నీలకంఠం కూడా వెళ్తాడు. అత్తింట్లో ఏదైనా సమస్య వస్తే తనకు కాల్ చేయమని మౌనికకు, ఏం జరగకుండా తనను చూసుకోవాలని కాంతంకు చెబుతుంది శ్రుతి. తర్వాత నీలకంఠం ఫ్యామిలీ వెళ్లిపోతుంది. మీనా పని చూస్తుండగా ఇంట్లోకి వచ్చిన ప్రభావతి అరుస్తుంది. నీకు బంగారం అంటే లెక్కలేదా, పోగొడతావా అని మండిపడుతుంది. ఇప్పుడు మీనా ఏం చేసిందని సత్యం అడ్డుకున్న ప్రభావతి వినదు.

మీ భార్యాభర్తల వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది. తాళి జాగ్రత్తగా పెట...