Hyderabad, మార్చి 15 -- Gunde Ninda Gudi Gantalu Serial: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమోలో మౌనిక ఇంట్లో ఫంక్షన్ కోసం అంతా రెడీ అయి వస్తారు. రవిపై బాలు సెటైర్లు వేస్తుంటాడు. ఇంతలో వచ్చిన శ్రుతి ఎవరిని అంటున్నాడు అని అడుగుతుంది. మనల్ని కాదులే అని రవి చెబుతాడు.

కానీ, వీన్నే అంటున్నాడను రవిని చూపిస్తాడు మనోజ్. అసలు నీకంటికి మీ తమ్ముడు ఎలా అని అనబోయిన శ్రుతి సత్యం, ప్రభావతి రావడం చూసి ఆగిపోతుంది. ఏంటీ నాన్న ఇప్పుడే లేచావా. రాత్రంతా నిద్రపోయినట్లు లేదే. ఇలా అయితే నీ ఆరోగ్యం ఏం కావాలి. పనులన్నీ పూర్తి అయిపోయాయి కదా. ఇంకెందుకు టెన్షను అని బాలు అంటాడు. దాంతో ప్రభావతిని సత్యం చూస్తాడు.

తర్వాత ఏమైందని బాలు అడుగుతాడు. కాకినాడ దగ్గర ఓ గుడి ఉంది. అక్కడికి నువ్వు వెళ్లి పూజ చేసి రావాలి అని ప్రభావతి చెబుతుంది. నేను వెళ్లను ఇక్క...