భారతదేశం, ఫిబ్రవరి 8 -- Gunadala Mary Matha Festival : గుణదల మేరీమాత ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తైయ్యాయి. ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు విజయవాడ గుణదల మేరీమాత ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు విజయవాడ సిటీ పోలీసులు తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏలూరు రోడ్డు మార్గంలో ఆర్టీసీ సిటీ బస్సులు, ఇతర వాహనాల రాకపోకలను మళ్లించినట్లు తెలిపారు. ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

పండిత్ నెహ్రూ సిటీ బస్టాండ్, పీసీఆర్ జంక్షన్, ఆర్టీసీ జంక్షన్, స్వర్ణ హోటల్ జంక్షన్, అప్సరా జంక్షన్, విజయ టాకీస్, దీప్తి జంక్షన్, చుట్టుగుంట సెంటర్, కుడి వైపునకు విశాలాంధ్ర రోడ్డులోకి తిరిగి, మెట్రో జంక్షన్, నైస్ బార్ జంక్షన్, జమ్మిచెట్టు, సిద్ధార్థ జంక్షన్, అమ్మ కల్యాణమంటపం, క్రీస్తు ...