Hyderabad, మార్చి 14 -- హోలీ పండుగ వచ్చిందంటే చాలు చాలా ఇళ్లలో కజ్జికాయలు, పకోడీలు తప్పనసరిగా ఉంటాయి. ఈ రోజున వీటిని తప్పనిసరిగా తినాలనే సంప్రదాయాన్ని చాలా మంది పాటిస్తారు. ఈ హోలీ నాడు మీ ఇంట్లో కూడా కజ్జికాయలను తప్పనిసరిగా చేసుకోవాలనుకుంటే ఈసారి కొత్తగా ట్రై చేయండి. కజ్జికాయలను రోటిన్‌గా కొబ్బరి, కోవా, డ్రైఫ్రూట్స్‌ వంటి వాటితో కాకుండా గుల్‌కంద్‌తో తయారు చేసి చూడండి. ఇవి చాలా రుచిగా ఉంటాయి.

గుల్‌కంద్‌ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఇది అనేక రకాల ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది. ముఖ్యంగా జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు, చర్మాన్ని మరింత కాంతివంతగా తయారు చేయడానికి, శరీరంలోని శక్తి స్థాయిలను పెంచడానికి గుల్‌కంద్‌ చాలా బాగా సహాయపడుతుంది. అలాంటి గుల్‌కంద్‌‌తో రుచికరమైన కజ్జికాయలను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం రండి.

గుల్‌కంద్‌ కజ్జికాయల...