భారతదేశం, మార్చి 13 -- ప్రపంచ చెస్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేశ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి ఆంధ్రప్రదేశ్ లోని ఈ ప్రముఖ పుణ్యక్షేత్రానికి వచ్చాడు. దర్శనానంతరం స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నాడు. తెలుగు మూలాలున్న గుకేశ్ కుటుంబం చెన్నైలో సెటిల్ అయింది.

గతేడాది సింగపూర్ లో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో గుకేశ్ విజేతగా నిలిచాడు. చైనా గ్రాండ్ మాస్టర్ డింగ్ లిరెన్ ను గుకేశ్ ఓడించాడు. అత్యంత పిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచిన ఆటగాడిగా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఈ టోర్నీలో విజయం తర్వాత తిరుమలకు రావాలని 18 ఏళ్ల గుకేశ్ అనుకున్నాడు. ఇప్పటికీ కుదిరింది.

చెస్ బోర్డుపై సంచలన విజయాలతో సాగుతున్న గుకేశ్ భారత నంబర్ వన్ ఆటగాడిగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రపంచ ఫిడే ర్యాంకింగ్స్ లో మూడో స్థానంలో కొనసా...