Hyderabad, ఫిబ్రవరి 28 -- Hero Viraj Reddy Cheelam About Guard Movie: అను ప్రొడక్షన్స్‌లో విరాజ్ రెడ్డి చీలం హీరోగా రూపొందిన చిత్రం 'గార్డ్'. రివెంజ్ ఫర్ లవ్ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన గార్డ్ మూవీ ఫిబ్రవరి 28న అంటే ఇవాళ విడుదల కానుంది. ఈ సినిమాలో మిమీ లియానార్డ్, శిల్పా బాలకృష్ణ హీరోయిన్స్‌గా నటించారు.

అనసూయ రెడ్డి నిర్మించిన తెలుగు హారర్ థ్రిల్లర్ గార్డ్ సినిమాకు జగ పెద్ది దర్శకత్వం వహించారు. రిలీజ్ ముందు రోజు గార్డ్ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హీరో విరాజ్ రెడ్డి చీలం మీడియాతో ముచ్చటించారు. ఆయన ఏం చెప్పారంటే?

* మాది నిజామాబాద్. ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లి సెటిల్ అయ్యాను. చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఇష్టం. అక్కడే యాక్టింగ్ స్కూల్‌కు వెళ్లాను. ఈ మూవీ మొత్తాన్ని కూడా ఆస్ట్రేలియాలోనే షూట్ చేశాం. నేను అక్కడే ఉండే వాడ్ని కా...