భారతదేశం, ఫిబ్రవరి 27 -- వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీస్ మేటర్, సర్వీస్ రిజిస్టర్లు, వారి సీనియారిటీ లిస్టు తయారు చేయాలని.. ఆర్‌డీఎంఏ అధికారుల‌ు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. త‌యారు చేసిన త‌రువాత స‌ర్వీస్ రిజిస్ట‌ర్‌ల‌ను నిర్వ‌హించ‌డం, జిల్లా స్థాయిలో సంబంధిత కేడ‌ర్‌ల ప‌దోన్న‌త‌ల కోసం సీనియారిటీ జాబితాల‌ను ప్ర‌చురించాల‌ని ప్రభుత్వం స్పష్టం చేసింది. తుది సీనియారిటీ జాబితా కాపీని రాష్ట్ర మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ క‌మిష‌న‌ర్ అండ్ డైరెక్ట‌ర్ కార్యాలయానికి తప్పకుండా పంపాలని సూచించింది.

రాష్ట్రంలో 3,842 వార్డు స‌చివాల‌యాల్లో దాదాపు 38 వేల మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్నారు. ఇప్ప‌టికే వార్డు స‌చివాల‌యాల‌ను జ‌నాభా ప్రాతిప‌దిక‌న‌ ఉద్యోగుల‌ను మూడు కేట‌గిరీలుగా విభ‌జిస్తూ.. ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీనిక...