Hyderabad, మార్చి 3 -- ఆందోళన, విచారం లాంటి మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడం చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది. మీరు ఒంటరివాళ్లు కాదనే ఫీలింగ్ తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందిపడాల్సి వస్తుంది. ఇలా చేయడం కోసం మీరు ప్రతిసారి ఒంటరిగా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఒక గ్రూపుగా ఉండి చేసే యాక్టివిటీలు కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటాయట. ఒకే విధమైన సమస్యను ఎదుర్కొంటున్న వారితో కలిసి గడపడం వల్ల ఫీలింగ్‌ను కొంతవరకూ మార్చుకోవచ్చట.

అది వ్యాయామమైనా, డ్యాన్సింగ్ అయినా మీకు కాస్త ఊరటనిస్తుందట. ఇది మిమ్మల్ని ఒంటరితనం నుంచి దూరం చేయడమే కాదు. ఇటువంటి గ్రూపులో జాయిన్ అవడం వల్ల మనలో కూడా కాస్త బాధ్యత పెరుగుతుంది. మిమ్మల్ని మానసిక సమస్యల నుంచి బయటపడేసే మెంటల్ హెల్త్ యాక్టివిటీస్‌లో కొన్నింటి గురించి తెలుసుకుందామా!

సమాజంలో తిరగడం, గ్రూపు యాక్టివిటీస్లో పాల్గొనడం మీ మానసిక...