Hyderabad, ఫిబ్రవరి 22 -- పచ్చిబఠానీలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఫైబర్, ప్రొటీన్‌లు అధికంగా ఉండే వీటిని తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి, రక్తపొటును నియంత్రించడానికి ఇవి చక్కటి ఆహార పదార్థంగా పనిచేస్తాయి. జింక్, రాగి, మాంగనీస్, ఐరన్ వంటి పోషకాలు కలిగి ఉన్న పచ్చి బఠానీలను రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం వల్ల షుగర్ లెవెల్ కూడా అదుపులో ఉంటుంది. ఆకలి నియంత్రణలో ఉంటుంది. చర్మారోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. రుచిలో కూడా పచ్చిబఠానీలు ఏం తక్కువ చేయవు. ఇంత ఆరోగ్యకరమైన పచ్చి బఠానీలతో వడలు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇదిగోండి రెసిపీ ఓ సారి ట్రై చేశారంటే మళ్లీ మళ్లీ చేసుకుని తింటుంటారు.ఇవి సాయంత్రం టీ పాటు తినే స్నాక్ గానూ, భోజనంతో పాటు నంచుకునే పదార్థంగానూ పనిచేస్తాయి. ఇంట్లో ప్రతి ...